Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు కొలికపోగు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ నెల 28,29న దేశ కార్మికలోకం పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ అనేక మంది కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో శనివారం వివిధ రంగాలకు చెందిన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో యాజమాన్యాలకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు మాట్లాడుతూ మోదీ గద్దెనెక్కిన దగ్గర్నుంచి దేశంలో పేదలను, సామాన్యులను గాలికొదిలేసి కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, వారికి అనుకూలంగా చట్టాలలో మార్పులు, చౌకబేరాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికలోకానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదని, పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిధ్ధంగా ఉన్నామన్నారు. దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసనను తెలియజేసి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, బషీర్, అప్పారావు, రజిని, వలి, వెంకటేశ్వరరావు, బాజీ, బాషా, బడేమియా, రమాదేవి, లకీë, నాగమణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.