Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
జిటి త్రిబుల్ ఎస్ ఆధ్వర్యంలో తాగునీటి అవసరాల ఉన్న గ్రామాలలో చేతిపంపులు వేస్తున్నారు. మండల పరిధిలోని సీతానగరం గ్రామంతో పాటు మరో నాలుగు గ్రామాలలో జిటి త్రిబుల్ ఎస్ ఆధ్వర్యంలో చేతిపంపులు వేశారు. సీతానగరంలో చేతి పంపును ఎస్సై తేజావత్ కవిత సీతానగరం సర్పంచ్ మాలెంపాటి వాణితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై కవిత మాట్లాడుతూ జిటి త్రిబుల్ ఎస్ క్రిస్టియన్ సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతస్థాయిలో చేయాలని కోరారు. సంస్థ చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. బోనకల్ చర్చి ఫాదర్ జి టి త్రిబుల్ ఎస్ ప్రతినిధి బుంగ ఎర్నెస్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తాగునీటి అవసరాలు ఉన్న గ్రామాల గుర్తించి ఆ ప్రాంత ప్రజల అవసరాలను బట్టి జిటి త్రిబుల్ ఎస్ ఆధ్వర్యంలో చేతి పంపులను ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీతానగరం ఉప సర్పంచ్ చిలక నాగరాజు, గ్రామస్తులు కటారి నాగేశ్వరరావు, నల్లమోతు నాగేశ్వరరావు, ఊటుకూరు బాలకృష్ణ, రేచర్ల బాలకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.