Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో డా.వైఆర్కె నెలనెలా వైద్య శిబిరం తన వంతు బాధ్యతను నిర్వహిస్తోందని నిర్వాహకులు, రిటైర్డ్ ఆర్జెడి యాదాల చార్లెస్ అన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్థానిక గుమస్తాల సంఘ భవనంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ డాక్టర్ల బందం రోగులను పరీక్షించి వారికి అవసరమైన బిపీ, షుగర్ మందులను నెలకు సరిపడా కేవలం 100 రూపాయలకే అందిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఇతర ఆరోగ్య, వైద్య సలహాలను ప్రజలకు వైద్య శిబిరం అందిస్తోందన్నారు. దీని వల్ల ప్రజలకు కొంత ఉపశమనం కలుగు తోందని తెలిపారు. ఈ శిబిరం నిర్వహణకు సహకరిస్తూ ఉచిత సేవలు అందుస్తున్న డాక్టర్స్ బృందానికి, వాలెంటీర్స్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ల బృంద సభ్యులు డా.పిల్లలమర్రి సుబ్బారావు, డా.కె యు భాస్కర్, డా.వెంకటేశ్వర్లు, వైద్య శిబిరం నిర్వహకులు యర్రా శ్రీకాంత్, యర్రా శ్రీనివాస రావు, బండారు రమేష్, భూక్య శ్రీను, తుశాకుల లింగయ్య, పత్తిపాక నాగసులోచన, హుస్సేన్, మలిశెట్టి రామారావు పాల్గొన్నారు.