Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
ఖమ్మంరూరల్ మండలంలోని ఏదులాపురం సహకార సంఘంలో జరిగిన అవినీతి, అక్రమాలపై శనివారం సహకార శాఖ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. సహకార సంఘం పాలకవర్గ సభ్యులందరినీ జిల్లా అధికారి ఎన్వీఎస్.ప్రసాద్ విచారించారు. గత ఖరీఫ్‌లో సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్లు, ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు సోసైటి చైర్మన్, మిల్లర్లు మిలకత్ అయి నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో చైర్మన్‌ను ఆ పదవి నుండి తప్పించారు. అనంతరం చైర్మన్ ధర్మారెడ్డి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో గత రెండు నెలలుగా అధికారులు జరిగిన అవినీతి అక్రమాలపై ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, హమాలీలు, సొసైటీ ఉద్యోగలను, మిల్లర్ల యజమానులను, పాలకవర్గ సభ్యులను విడతల వారీగా (సెక్షన్ 51) ప్రకారం విచారిస్తున్నారు. అందులో బాగంగానే పాలకవర్గం సభ్యులను విచారించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు జిల్లా అధికారి ఎన్విఎస్.ప్రసాద్ తెలిపారు.