Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు అధికంగా కేటాయించాలి : నున్నా
నవతెలంగాణ- ఖమ్మం
గిరిజన నియోజకవర్గమైన వైరా సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిం చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూక్యా వీరభద్రంలు డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవన్ సిపిఎం వైరా నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో గిరిజనులు, పేదలు, రైతులు, కార్మికులు అధికంగా ఉన్న కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు, కాణిజర్ల, వైరా ప్రాంతాల్లో గ్రామాల సమగ్రాభివృద్ధికి మరియు విద్య, వైద్యం కొరకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో నియోజవర్గంలో బాగా దెబ్బతిన్న మిర్చి రైతుల గురించి ప్రస్తావించకపోవడం భాధాకరమైన విషయమని, ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్లో మిర్చి రైతులకు నష్టపరిహారం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, తాళ్లపల్లి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, కె, నరేంద్ర, దాంతబోయిన నాగేశ్వరరావు, చెర్కుమల్లి కుటుంబరావు, నాయ కులు వజ్జా రామారావు, చింతనిప్పు చలపతిరావు, తుమ్ము సుధాకర్, బాజ్జి రమణ, జమ్మి అశోక్, ధరావత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.