Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలం మేడిదపల్లి గ్రామంలో వంద రోజులు పని పూర్తి చేసిన సందర్భంగా ఈజీఎస్ పనులకు ఎక్కువ శాతం మహిళలు వస్తున్నందున మహిళా కూలీలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ఎంపీడీవో జయరాం పాల్గొని మాట్లాడుతూ మేడిదపల్లి గ్రామంలో ఈజీఎస్ పనులకు ఎక్కువగా మహిళలు పాల్గొన్నారు. వంద రోజులు పని పూర్తి చేసుకుని గ్రామంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా కూలీలను సన్మానించడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల విజయ సురేష్, ఉప సర్పంచ్ మోర ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఎర్ర పుష్పలత, సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, ఈసీ వెంకటేశ్వర్లు, మనోహర్, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.