Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కట్నం తీసుకోని యువకుడు మోసం
నవతెలంగాణ-మణుగూరు
ఫేస్బుక్లో ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని రూ.5లక్షలు కట్నం తీసుకోని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీకి చెందిన ఓ అమ్మాయిని మణుగూరు మండలం ఊడతానిగుంపుకు చెందిన హారీష్పాసి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు ప్రేమకు దారి తీసింది. అమ్మాయి ఎంఎస్సి బీఈడి చదువుకోని పూనేలో ఒక కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది. 2018లో ఫేస్బుక్లో పరిచయమైనా హారీష్ ఒకటే కులం కావడంతో ప్రేమించకున్నామని అమ్మాయి తెలిపింది. కొన్ని రోజుల తరువాత హారీష్పాసి పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. ఒకటే కులం కావడంతో మా ఇంట్లో వాళ్లతో చర్చించి, హారీష్‌కు చెప్పాను. అతని కుటుంబ సభ్యులు కూడా సరే అన్నారు. కట్నం క్రింద రూ.5 లక్షలు అడిగాడని అమ్మాయి చెప్పింది. తాను పూనేలో ఉండడం కారణంగా నా ఫ్రె˜ండ్ పురుషోత్తం మధ్యవర్తిగా హారీష్ అకౌంట్ నంబర్ (004001028816)లో రూ.5 లక్షలు వేశాను. ఫోన్ రీచార్జ్‌లకు ఇతర అవసరాలకు కూడా డబ్బులు ఇచ్చేదాన్ని అమ్మాయి తెలిపింది. మా పెళ్ళి విషయం మాట్లాడడానికి నేను హారీష్పాసి కుటుంబసభ్యులు భద్రాచలంలో కలుసుకోని మాట్లాడుకున్నాం. 2019లో హారీష్పాసికి తన తండ్రి సింగరేణి ఉద్యోగం లభించింది. అప్పటినుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పెళ్ళి చేసుకోమ్మని అడిగినప్పుడు వాయిదా వేస్తున్నాడు.
ఈ విషయంపై ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు అయిందని ఇరుపక్షాలు కోర్టులో కేసు నడుస్తుండగా వేరే అమ్మాయితో మార్చి 9న మహారాష్ట్రలో పలాస్లో దొంగతనంగా వివాహం చేసుకున్నాడు. 11వ తేదీన మణుగూరులో ఊడతానిగుంపులో రిసెప్షన్ జరుగుతుండగా అమ్మాయి వచ్చింది. ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వాళ్లు 100 నంబర్‌కు డయల్ చేయగా పోలీసులు ఇద్దరిని సిఐ ముత్యం.రమేష్ వద్దకు తీసుకువెళ్లారు. అతను పెళ్లి చేసుకున్న పెళ్లి ఫొటోలు, పెళ్లి పత్రికలు ఇప్పించి మళ్లీ కేసు వేయమని చెప్పి ఆమెకు సలహా ఇచ్చి పంపించారు. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తెలిపింది. నాలుగు సంవత్సరాలు నా భవిష్యత్‌ను ప్రశ్నార్దకంలో పడేశాడు. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు అతను ఎలా పెళ్లి చేసుకున్నాడని,నాకు న్యాయం చేయాలని ఆమె కోరింది.