Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఖమ్మం డిపోలో ''డిమాండ్స్ డే'' కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుండి ఖమ్మం డిపో జేఏసీ నాయకులు గుండు మాధవరావు, బేతంపూడి బుచ్చిబాబుల ఆధ్వర్యంలో ఖమ్మం డిపో వద్ద డిమాండ్ బ్యాడ్జీలు ధరించి కార్మికులు ''డిమాండ్స్ డే''లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలని, ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017, 2021 రెండు సంవత్సరాల వేతన సవరణను వెంటనే అమలు చేయాలనారు, ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన డి.ఎ లను వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పి.యఫ్), కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సి.సి.ఎస్)లకు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాటి అప్పారావు, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, తిప్పారెడ్డి ఉపేందర్ రెడ్డి, పిట్టల సుధాకర్, పిల్లి రమేష్ పాల్గొన్నారు.