Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కేంద్రప్రభుత్వం బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్ అన్నారు. సోమవారం కేసిహెచ్పిలో ఫిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టీకరణ పెరిగిపోయిందన్నారు. మణుగూరు కొండాపురం మైన్, ఓసి4, మణుగూరు ఓసి, కేసిహెచ్పిలో క్రషర్లు, ఇతర పనులను ప్రైవేట్ వారికి అప్పగించారన్నారు. దీనిని వ్యతిరేకించాల్సిన గుర్తింపు సంఘం మాట్లాడలేదన్నారు. కేసిహెచ్పిలో బొగ్గు చూర వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. కేసిహెచ్పిలో రూ.1200 ఇన్సెంటివ్ను వర్తింజేయాలన్నారు. సిఏఎస్పిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. క్యాంటీన్ సౌకర్యం మెరుగు పరచాలన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28,29 తేదీలలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడాన్ని నిరసిస్తూ సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్బంగా గోడిపతిని ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో నాయకులు రామనర్సయ్య, నాగరాజు, ఎస్కె.సుభాని, శ్రీనివాస్, కోడిరెక్కల శ్రీనివాస్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.