Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
శ్రామికవర్గ విముక్తి పోరాటం ద్వారా మార్క్స్‌కి మనమిచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. స్థానిక మంచికంటి భవన్లో కారల్ మార్క్స్ 139 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మొదట మార్క్స్ చిత్రపటానికి సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని ఐలయ్య పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ మార్క్స్ మరణించి 139 సంవత్సరాలు దాటిందని, కానీ ఆయన మానవ జాతికి అందించిన తాత్విక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక భావజాలం సమస్త శ్రామిక శక్తులకు నిత్య చైతన్యాన్ని అందిస్తూనే ఉందన్నారు. ఆయన భావాలు మానవ జాతికి లభించిన గొప్ప సంపదని, మానవ సంస్కృతి చరిత్రలో మార్క్సిజంతో ఏస్థాయి లోనైనా సరే పోల్చదగినది సిద్ధాంతం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. మార్క్స్ మనకందించిన తాత్వికాంశాలు, పెట్టుబడి, చారిత్రక భౌతిక వాదం మొదలైన విషయాలన్నీ సమాజ పరిణామ క్రమాలలో ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూపెడుతాయని అంతే కాదు, ఎలా మార్చుకోవాలో కూడా స్పష్టంగా వివరిస్తాయన్నారు. దోపిడీ, పీడనలేని సమసమాజ నిర్మాణానికి మార్క్స్ రాసిన క్యాపిటల్ ఆయుధం లాంటిదని కమ్యూనిస్టు సమాజంలో కన్నీళ్ళకు, కష్టాలకు తావుండదు. అదొక సుందర స్వప్నం అనివార్యపు సత్యం అని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని భారత దేశ పరిస్థితులకు అన్వయించి వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం మార్క్స్‌కి ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే. రమేష్, లిక్కీ బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కున్సోత్ ధర్మ, భూక్యా రమేష్, పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, కర్ల వీరస్వామి, కూరపాటి సమ్మయ్య, గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లిలో....
లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని రేగళ్ల బావోజీ తండా సెంటర్లలో కారల్ మార్క్ 139 వర్ధంతి నిర్వహించారు. కారల్ మార్క్స్ 139 వర్ధంతిని పురస్కరించుకొని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో కార్మిక వర్గానికి మౌలికమైన సమస్యలపై ఆర్థిక వేత్త కారల్ మార్క్స్ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నినాదం ఇచ్చి తన కుటుంబాన్ని తన పిల్లలని పేదరికంలో జీవిస్తూ అనేక దేశాలలో బహిష్కరణకు గురై ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి పెట్టుబడిదారీ వర్గానికి ఉన్న వైరుధ్యాన్ని కార్మిక వర్గానికి తెలియజేసి అంతిమ విజయం కార్మికులది అని చాటి చెప్పిన మహానుభావుడు కార్ల్ మార్క్స్ అని గుర్తు చేశారు. పార్టీ మండ ల కార్యదర్శి యు.నాగేశ్వరరావు మాట్లా డుతూ ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచి కార్ల్ మార్క్స్ అన్నారు. వాంకుడోత్ కోబల్, రత్ని, సురేష్, తేజావత్ వెంకన్న, బాబు, హరికృష్ణ, పాల్గొన్నారు.
దమ్మపేట : మండల కేంద్రంలో కారల్ మార్క్స్ 139వ వర్థంతి సభను సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం స్థానిక సుందయ్య భవన్లో మండల కమిటీ సభ్యులు రావుల శోభన్‌బాబు అధ్యక్షతన మార్క్స్ 139 వ వర్థంతి సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా సెక్రటేరియెట్ మెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య హాజరై కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, జిల్లా కమిటి సభ్యులు దొడ్డ లకిëనారాయణ, పిల్లినాయుడు, పెనుబల్లి నానారావు, కొలికపోగు శ్రీనివాసరావు, లింగారెడ్డి శివశంకర్, పిట్టల పోలమ్మ, బోగి నరసింహరావు, కొప్పుల శ్రీనివాసరావు, మల్లా సత్యం పాల్గొన్నారు.