Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడెంలో కార్పొరేట్ వైద్య సేవలు
- వరుణ్ ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అరుదైన ఘనత
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం వైద్య రంగంలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. వరుణ్ ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు ఆపరేషన్‌చేసి కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నామన్న ఘనత సొంతంచేసు కున్నారు. డాక్టర్ వరుణ్ కుమార్ నేతృత్వంలో ఒకే సారి రెండు మోకాళ్లు మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. వివరాల్లోకి వెళితే 50 సంవత్సరాల డి.ప్రమీల రాణి తీవ్ర మోకాళ్ల నొప్పులతో, నడవలేని స్థితిలో, అరిగి, పక్కకు జరిగిపోయిన రెండు మోకాళ్ళకు శస్త్ర చికిత్సకు కొత్తగూడెంలోని వరుణ్ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సంప్రదించారు. పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా, కేవలం 4 గంటల్లో ఆమె రెండు మోకాళ్లు మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్తగూడెం వైద్య చరిత్రలో చెరగని మైలురాయిని సొంతం చేసుకున్నామని ఆసుపత్రి కన్సల్టెంట్, వైద్యులు డాక్టర్ జి.వరుణ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఇటువంటి అరుదైన కార్పొరేట్ స్థాయి సర్జరీలను గూడెం వాసులకు అందించి, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో చేశామని తెలిపారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సకు సహకరించిన మత్తు వైద్య నిపుణులు డాక్టర్ బి.రాము, ఇతర సపోర్టివ్ సిబ్బందికి మేనేజ్ మెంట్ తరపున జి.వసంత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన కార్పొరేట్ వైద్యం తమ ప్రత్యేకతగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.