Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మండల పరిషత్ కార్యాయంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. తొలుత ఎంపీడీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్మికుల మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షునిగా చిక్కుల శ్రీనివాసరావు, కార్యదర్శిగా సుందర ప్రసాద్, గౌరవ అధ్యక్షులుగా మహ్మద్ యూసుఫ్, ఉపాధ్యక్షుడిగా సురేష్, కొక్కెరగడ్డ సతీష్, సహాయ కార్యదర్శులుగా కుకర్, బొబ్బిలి బాబూరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, గడ్డల మహేష్, ప్రసాద్, సత్యనారాయణ, చిట్టి రామకృష్ణ, సంజీవరావు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.