Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల పదువులు రద్దు చేస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ పోదెం వీరయ్య సోమవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందా సంతోష్‌కుమార్ అన్నారు. నియోజకవర్గ కో కన్వీనర్ గురిజాల గోపి, ఏ బ్లాక్ కో ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హూస్సేన్ పదవులను భద్రాచలం ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదేం వీరయ్య రద్దు చేశారన్నారు. మండలంలో వివిధ పదవులలో ఉన్నా వారు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వాన్ని వేగవంతం చేయాలని తెలిపారన్నారు.