Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్దోషిగా ప్రజల ముందుకు వస్తా
- రాఘవను కలిసేందుకు భారీగా తరలివెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,
నాయకులు, కార్యకర్తలు
నవతెలంగాణ-పాల్వంచ
ఇటీవల ఖమ్మం సబ్ జైలు నుండి విడుదలై వచ్చిన కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావును కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కలిశారు. శుక్రవారం జైలు నుండి విడుదలైన రాఘవ ఏలూరుకి వెళ్లారు. శుక్ర, శని, ఆదివారాలలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు ఏలూరు వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కొందరు కక్షపూరితంగా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక నాపై ఆరోపణలు చేసి, జైలుకు పంపారని ఆరోపణలన్నీ తొలగిపోయి నిర్దోషిగా ప్రజల ముందుకు వస్తానని, తనను కలిసిన నాయకులకు రాఘవ చెప్పారు. మేము అందరం వనమా రాఘవ వెంటనే అని మద్దతు పలికారు. ఈ సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. రాఘవను కలిసిన ప్రముఖులు కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. వారిలో డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, కొత్తగూడెం విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షులు మండే వేరు హనుమంతరావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, మరో 20 మంది కౌన్సిలర్లు కొలాపూరి ధర్మరాజు, లక్ష్మణ్, దుంపల అనురాధ, సత్యవతి, వేణు, రావి రాంబాబు, సుందరాజు, మసూద్, వేముల ప్రసాదు, పూర్ణ, కొండ, కనుకుంట్ల పార్వతి, చుంచుపల్లి ఎంపీపీ శాంతి, ఎంపీటీసీలు కొల్లు పద్మ తదితరులు, 30 మంది సర్పంచులు పెద్దమ్మ తల్లి దేవాలయం చైర్మన్ మహీపతి రామలింగం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ విశాల సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షులు పెద్దమ్మ తల్లి దేవాలయం ట్రస్ట్ సభ్యులు నాగరాజు శెట్టి విజరు, తెలంగాణ రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు విశ్వనాథం, లక్ష్మీదేవి పల్లి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కొత్తగూడెం ఉర్దూ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజా, కే కే శ్రీను, పీకే కృష్ణ, మధ్యల శివకుమార్, ఆర్.ఎస్ మధుసూధనరావు, పాల్వంచ ఎంపీపీ సరస్వతి లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ సుజాత, సుజాతనగర్ ఎంపీపీ విజయలక్ష్మి, కొత్తగూడెం మాజీ చైర్పర్సన్ కాసుల ఉమారాణి, హను మంతు, కనకాల బాలకృష్ణ, చల్లగుండ్ల వీరభద్రం, బండి లక్ష్మణ్, కేటీపీఎస్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు దానం నరసింహారావు, కొర్రా వెంకట్ తదితరులు ఉన్నారు. రెండు రోజుల నుండి ఏలూరులో కొత్తగూడెం నియోజ కవర్గ వనమా అభిమానుల తాకిడి ఎక్కువైంది వనమా రాఘవను కార్యకర్తలు అభిమానులు పోటీలుపడి ఆలిం గనం చేసుకున్నారు. రాఘవ లేనిలోటు కొత్తగూడెం నియోజకవర్గంలో కనపడుతుం దని వాపోయారు. ఏదిఏమైనా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో మన కుటుంబం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఏదిఏమైనా మీవెంటే మేము అని కార్యకర్తలు అన్నారు.
వనమా ప్రకటనపై పార్టీ వర్గాల్లో హర్షాతిరేకం
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వనమా రాఘవ అరెస్టు తదితర తదనంతర పరిణామాలతో కార్యకర్తలలో ప్రకటన ఉత్సాహం నింపింది. ఇదే సందర్భంలో తన తనయుడు రాఘవన్ కొందరు కక్షగట్టి జైలుకు పంపారని పంపిన వారి సంగతి తేలుస్తా అని చెప్పడం పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపింది. నిన్న అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ నేను అనారోగ్యంగా ఉండి రెండు నెలలుగా చికిత్స తీసుకుంటున్నా, ఆ సమయంలో నా కుమారుడు రాఘవపై తప్పుడు కేసులు బనాయించారని, నిజానిజాలు బయటకు తీసుకు వస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పారు.