Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక ఎస్సై మేడ ప్రసాద్
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గత పది రోజుల నుండి గ్రామ రైతులకు సంబంధించిన వరి గడ్డి వాములకు రాత్రి సమయంలో నిప్పు పెట్టి కాల పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై మేడ ప్రసాద్ పరిశీలించారు. ఎర్రుపాలెం మండల పరిధిలో ని భీమవరం గ్రామంలో ఈనెల 1వ తేదీ నుం డి నేటి వరకు ఎనిమిది వరిగడ్డి వాములను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారని రైతు నల్లమోతు హనుమంతరావు పిర్యాదు చేయడంతో భీమవరం గ్రామానికి వెళ్లి కాలి పోయిన వరి గడ్డి వాములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, ఎంపీటీసీ సభ్యులు సంక్రాంతి కృష్ణారావు, ఉప సర్పంచ్ అనుమోలు కృష్ణారావు, గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, శ్రీలం శ్రీనివాస్ రెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.