Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దారుకు వినతి
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
తహసీల్దారు కార్యాలయంలో రాత్రిపూట వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తూ హత్య గావించబడ్డ మంచిర్యాల మండలం కన్నెపల్లి విఆర్ఏ దుర్గం బాబును హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ వీఆర్ఎలు ఖమ్మం రూరల్ తహసీల్దారు సుమకు సోమవారం వినతిపత్రం అందజేశారు. విఆర్ఏ ల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు లింగరాజు, మండలాధ్యక్షుడు చాంద్ మియా, బాలకృష్ణ నాగరాజు,వీరయ్య, మురళి,ఉపేందర్, రామారావు, సైదులు,మౌనిక తదితరులు పాల్గొన్నారు.