Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవునూరి మధు
నవతెలంగాణ-ఇల్లందు
ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ యువతరం పిడికిలి బిగించాలి, యువతరమే ఏ జాతికైనా నిర్మాతలని, అలాగే చైతన్యము కావాలని యువతకు న్యూడెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకులు ఆవునూరి మధు, సీఎల్సీ రాష్ట్ర కార్యదర్శి పోట్లపల్లి విప్లవ్ కుమార్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచకొండ జనార్దన్ పిలుపునిచ్చారు. సోమవారం పీివైఎల్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ ఇల్లందులోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయం ఎల్లన్న విజ్ఞానకేంద్రం పగడాల వెంకన్న ప్రాంగణంలో నిర్వహించారు. రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అన్నారు. ఏదేశ చరిత్రలోనైన యువకుల త్యాగంలేని పోరాటమేలేదని అటువంటి యువతను పాలకులు పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. తొలుత పట్టణంలో అమరుడు ఎల్లన్న విజ్ఞాన కేద్రం నుండి ప్రదర్శనగా బయలుదేరి అంబజార్ జగదాంబ సెంటర్, పాత బస్తాన్డ్ మీదుగా బుగ్గవాగు భగత్ సింగ్ సెంటర్ ఎల్లన్న విజ్ఞాన కేంద్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పీవైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సకృ, ఐఎఫ్టీయు జిల్లా ప్రాధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ప్రసంగించారు.