Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పెట్టుబడి దారీ సంక్షోభాల పరిష్కారంకు మార్క్సిజం మాత్రమే ఆధారం
- 139వ వర్థంతి సందర్భంగా నివాళి
నవతెలంగాణ-వైరా టౌన్
విశ్వ మానవాళికి సమానత్వ సిద్ధాంతం అందించిన గొప్ప తాత్వికుడు కార్ల్ మార్క్స్ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సీనియర్ నాయకులు పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మల్లెంపాటి వీరభద్రం అన్నారు. మిలియనీయం మేధావి కార్ల్ మార్క్స్ 139వ వర్థంతి సందర్భంగా సోమవారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థ లాభం, నియత్రుత్వం వైపు నడిపించిందని, కార్మిక విప్లవం సమానత్వం, స్వేచ్ఛ వైపు మానవాళి పురొగతికి కృషి చేస్తుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బొడపట్ల రవీందర్, మల్లెంపాటి రామారావు, అనుమోలు రామారావు, పైడిపల్లి సాంబశివరావు, గుమ్మా నర్సింహారావు, తూము సుధాకర్, మల్లెంపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.