Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు ఈనెల 12, 13 తేదీలలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో జరిగాయి. రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల నోటిఫికేషన్ విడుదల చేయాలని, 80వేల పోస్టు ఇస్తామని నోటిఫై చేయడం కాదని దీని పైన పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లు ఉద్యోగ భృతి విధి విధానాలు ప్రకటించాలని, రూ 10 వేలు నిరుద్యోగులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, జిల్లా నాయకులు చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, శీలం వీరబాబు, కానతల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, కనపర్తి గిరి, బొడ్డు మధు, చీర చక్రి, ఆంజనేయులు, ఆవుల పార్టీ నాగరాజు, రత్న కిషోర్, కొర్రపాటి రాజేష్, నాగరాజు, రాజేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.