Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంరూరల్
మార్చి 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకు వచ్చి కార్మికుల హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అతి చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పగించి భవన నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెంచి మధ్య తరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండా చేయడం వలన పనులు దొరకక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 28, 29 దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెకు మండలంలోని అన్ని రంగాలకు సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు స్వచ్ఛం దంగా బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దోనోజు పాపయ్య, పెనుగొండ వీరయ్య, సారిక లింగయ్య, ఐతగాని రవి, నాగయ్య, చిన్న రాములు, బండారు కోటేశ్వరరావు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.