Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన బానోత్ శ్యామ్లాల్-మాలి కూతురు నవ్య ఎన్ఐటీ కాలికట్లో ఎమ్మెస్సీ గణితంలో ప్రవేశానికి జామ్ పరీక్షలో 5,046 ర్యాంకు సాధించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యార్ధిని నవ్యను అభినందిస్తూ రూ.5వేల నగదును మాధారం సర్పంచ్ అజ్మీర నరేష్ చేతుల మీదిగా తల్లాడలో ఇప్పించారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని పొంగులేటి ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుర్రం నర్సింహరావు, కాసాని లక్ష్మినారాయణ, శ్యామ్లాల్ తదితరులు పాల్గొన్నారు.