Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల కేంద్రంలో మార్చి 18 న జరిగే తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ద్వితీయ మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం కొణిజర్ల మండలం పలు గ్రామాల్లో రైతు మహాసభలు జయప్రదం కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న మునగాల గ్రామం లో రైతు సదస్సులో రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల కపట ప్రేమ చూపుతున్నాయన్నారు.కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తు రైతుల ఉత్పత్తుల ధరలు పెంచకుండా మరోవైపు పంటలు సాగు చేయడానికి అవసరమైన ఇన్పుట్స్ ధరలు విపరీతంగా పెంచి రైతులకు ఆదాయం లేకుండా చేస్తు అప్పులు ఊబిలోకి నెట్టుతున్నారని అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాల్సి అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, మండల నాయకులు చింతనిప్పు నరసింహరావు, శేషయ్య, లింగయ్య, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.