Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో గోకినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం పదవతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కొమ్మినేని శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు ప్యాడ్స్, పెన్నులు, పెన్సిలు, స్కేలు, మాస్కులు శానిటేషన్ వితరణగా సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ గుగులోతు క్రాంతిబాబునాయక్, ఎంపీటీసీ సభ్యులు పెద్దపొంగు రాంబాబు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడలి నాగరాజు, గ్రామ పెద్దలు కొమ్మినేని సుధాకర్, మచ్చా సత్యనారాయణ, చావా శరత్ పాల్గొన్నారు.