Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-తల్లాడ
''నేను ఎక్కడున్నా... ఏం చేస్తున్నా... నా మదిలో మెదిలే మొట్టమొదటి ఆలోచనలు మీవే... నా కార్యకర్తలు... నా అభిమానులు... నా ప్రజలు ఎలా ఉన్నారు... ఏం చేస్తున్నారు... వారి కష్టాసుఖాల్లో నేను భాగస్వామిని కావాలని... నా వంతు ఏదైనా సహాయం చేయాలన్నదే నా నిరంతర తపన... నా జీవితం ప్రజాసేవకే అంకితం... రాజకీయాల్లోకి ప్రవేశించిందే ప్రజలకు సేవ చేయాలని... శీనన్న ఉన్నాడనే నమ్మకం... ధైర్యం ఉంచండి చాలు... ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తా ... రానున్న కాలంలో మనకు మంచి భవిష్యత్తు ఉండబోతుందని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం తల్లాడ మండల పర్యటనలో భాగంగా ఆయన ప్రసంగించారు. తల్లాడ మండలంలోని మంగాపురం, తల్లాడ మండల కేంద్రం, గొల్లగూడెం, అంజనాపురం, రామానుజవరం, మిట్టపల్లి గ్రామాలను సందర్శించి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాలను అందజేశారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి పర్యటన ఆసాంతం పొంగులేటి కాన్వారును అనుసరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డాక్టర్ మట్టా దయానంద్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మువ్వా సత్యంబాబు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, యెర్రి నరసింహారావు, దుండేటి వీరారెడ్డి, తూము వెంకట నారాయణ, గణేశుల రవి, పాసంగులపాటి లక్ష్మీ నారాయణ, మిట్టపల్లి సర్పంచ్ మాగంటి కృష్ణయ్య, కలకొడిమా సొసైటీ ఛైర్మన్ దిరిశాల నరసింహారావు, అంజనాపురం సర్పంచ్ కొమ్మినేని ప్రభాకర్ రావు, బిల్లుపాడు ఉప సర్పంచ్ సామినేని రామప్పరావు తదితరులు పాల్గొన్నారు.
వైరాలో పొంగులేటి పర్యటన
వైరా: వైరా నియోజకవర్గంలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యటించారు. వైరా మండల కేంద్రంతో పాటు గరికపాడు, కేజీ సిరిపురంలో ఆయన పర్యటన కొనసాగింది. కేజీ సిరిపురం గ్రామంలో సాగినేని సూరమ్మ ఇటీవల మృతిచెందారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గర్భిణీలకు ఉచిత ఆటో వసతి కల్పిస్తున్న లతీఫ్‌ను అభినందించారు. ఇటీవల గరికపాడు మాజీ సర్పంచ్ శీలం కరుణాకర్ రెడ్డి దంపతులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మరికొన్ని కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయాలను అందజేశారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వస్త్రాలను బహూకరించారు. కార్యక్రమంలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, రైతు బందు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ధార్న రాజశేఖర్, కోసూరి శ్రీనివాసరావు, ముసలిమడుగు ఎంపీటీసీ శీలం వెంకటరామిరెడ్డి, గన్నవరం సర్పంచ్ వేమిరెడ్డి విజయ లక్ష్మి, గరికపాటి సొసైటీ మాజీ అధ్యక్షులు శీలం సురేందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ గుగులోత్ లక్ష్మీబాయి, గుడిపుడి రామకృష్ణ పనితి సైదులు, తేళ్లూరి విజయారావు, మాగంటి వెంకటసామి, రేమళ్ల దావీదు పాల్గొన్నారు.