Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకోవటం లేదని భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన మండల పరిధిలో మేడపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన కోనం సునీత గత ఐదు సంవత్సరాల క్రితం కారేపల్లిలో సముద్రాల వేణుతో పరిచయం ఏర్పడి ఆపరిచయం కాస్త ప్రేమగా మారి వారిరువురు కొంతకాలం కలిసి ఉన్నారు. ఆతర్వాత వేణు ముఖం చాటేయడంతో పెద్దమనుషుల సమక్షంలో 2021 అక్టోబర్ లో బందుమిత్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకొని రెండు నెలలపాటు హైదరాబాదులో కలిసి ఉన్నారు. ఆ తర్వాత మీ పుట్టింటికి పంపించాడు. వస్తానని చెప్పి నాలుగు నెలల నుండి నేటివరకు రాకపోవడంతో ఆవేదన చెందిన సునీత ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయట్లేదని, బంధుమిత్రుల తర్వాత అడ్రస్ ఆరా తీసిన దొరక్కపోవడంతో తన భర్త సముద్రాల వేణు సొంత గ్రామమైన మేడేపల్లి గ్రామానికి వచ్చి తన ఇంట్లోకి వెళ్లగా వేణు తాతయ్య అమ్మమ్మ ఇంట్లోకి రానియలేదు. దీంతో సునీత ఇంటి ముందే ధర్నాకు దిగింది. తన భర్త వేణు వచ్చేంతవరకు తనకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే ఉంటానని భీష్మించుకుని కూర్చుంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.