Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్ఐ మృతి, హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఏఎస్ఐ రాజేంద్ర సింగ్ మృతి చెందగా, హెడ్ కానిస్టేబుల్ మహేష్ గాయాల పాలైన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రానికి 30 కిమీ దూరంలో గల సోనాపూర్ పోలీస్ స్టేషన్నుండి దొండరీబేడ్ గ్రామం వరకు రహదారి పనులు చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనుల రక్షణ చర్యల్లో భాగంగా 53 బెటాలియన్‌కు చెందిన జవాన్లు వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలింది. ఈ పేలుడులో ఏఎస్ఐ రాజేంద్రసింగ్ మృతి చెందగా, హెడ్ కానిస్టేబుల్ మహేష్ద్యాల్ గాయాలపాలయ్యాడు. గాయాలపాలైన హెడ్ కానిస్టేబుల్ మహేష్‌ను జిల్లా కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హెలికాఫ్టర్ ద్వారా రాయపూర్ తరలించారు. కాగా పోలీసులు అప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు.