Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మార్చి 28, 29 తారీకులలో జరుగు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ స్టేట్ షీడ్ కార్పొరేషన్ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు సిఐటియు ఖమ్మం రీజినల్ మేనేజర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల కాలం నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అందులో భాగంగానే 27 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులుగా విభజించిందన్నారు. అలాగే కార్మికుల పనిగంటలు విధానాన్ని ఇచ్చిందని వీటికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానోత్ దేవుజి మండల నాయకులు అవిరేణి రత్నాకర్, మండల నాయకులు ఎరుపుల శ్రీనివాసరావు, లచ్చు వెంకన్న, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.