Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధిర ఏఎంసి చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
పశు వ్యాధుల పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో పాడి పశువులకు, జీవాలకు మంగళవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల జాతి అభివృద్ధికి వ్యాధి నిరోధకతను పెంచడం, అంతేకాకుండా గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అమలు చేసే విధంగా పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. అనంతరం పాడి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పాడి సంపదను వృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగా రవి కుమార్, సర్పంచ్ కిన్నెర వాణి, ఎంపిటిసి ఎంగల మార్తమ్మ, మధిర మండల రైతు బంధు కన్వీనర్ చావా వేణు, పశు వైద్యులు ప్రవీణ్, నాగేంద్ర కుమార్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌదరెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ హనుమంతరావు, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ సైదిరెడ్డి సూపర్వైజర్లు దినేష్ కుమార్, జగదీష్ కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.