Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభను వెలికితీయడమే ఎస్బీఏ-బీకేజీఎం లక్ష్యం
- ''ఇండోర్'' ఏర్పాటుకు యుద్ధప్రాతిపధికన కృషి
- ఈ నెల 20న అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం
- విలేకరుల సమావేశంలో ప్రధానకార్యదర్శి చైతన్య కృష్ణ
- నూతన షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-కొత్తగూడెం
క్రీడాకారులు ఉన్నప్పటికీ సౌకర్యాలు లేక షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులలో దాగిన ప్రతిభ మరుగున పడిపోతుందని, బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం ముందుకు వెళుతోందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చైతన్య కృష్ణ స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో గల ప్రకృతి ఆశ్రమంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సలహాదారులు, హౌంగార్డ్స్ వెల్ఫేర్ ఆర్ఐ తుత్తురు దామోదర్, శ్రీ వివేకవర్ధిని, నలంద విద్యా సంస్థల సీఈఓ, భద్రాద్రి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేదరమెట్ల చైతన్య కృష్ణ పాల్గొని ప్రసంగించారు. ముందుగా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని క్రీడాకారులకు అందరికీ ఇండోర్ స్టేడియంలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని, ప్రభుత్వం స్పందించిందని చైతన్య కృష్ణ తెలిపారు. ఈ నెల 20వ తేదీన కొత్తగూడెం క్లబ్ జరగబోయే అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. షటిల్ క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని ఎల్లలు దాటించాలని ఆయన ఆకాంక్షించారు.
నూతన కమిటీ ఎన్నిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చైతన్య కృష్ణ పూర్తి స్థాయి కమిటీని ప్రకటించారు. షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య సలహాదారుగా జిల్లా పౌర సంబధాల అధికారి (డిపిఆర్ఓ) శ్రీలం శ్రీనివాసరావు, సలహాదారులుగా ఆర్ఐ దామోదర్, సోములు నాయక్, అధ్యక్షుడిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ చారుగుండ్ల రాజశేఖర్ అయ్యప్ప, ఉపాధ్యక్షులుగా వై.వేణుగోపాల్, వెంకట్ (పాల్వంచ కోచ్), ట్రెజరర్‌గా ధారావత్ రమేష్, జాయింట్ సెక్రటరీలుగా తేలుకుంట్ల రామ్‌కుమార్, దాసరి గంగాధర్, సహాయ కార్యదర్శులుగా వర్స లక్ష్మణ్, పండుగ రేశ్వంత్, గిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా హసన్, భాగ్యరాజ్, సుధాకర్, భార్గవ్, ఏళ్లేశ్వరావు, పవన్ (పాల్వంచ) పబ్లిసిటీ సెక్రటరీలుగా యతిరాజ్ కుమార్, నాగీశ్వర్ర్లను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా శ్రీను, శరత్ బాబు (చండ్రుగొండ) బలరాం నాయక్ ( జూలూరుపాడు) అంజి, పాష (సుజాతనగర్) శ్రీను, విష్ణువర్ధన్ (రామవరం).లక్ష్మణ్, ప్రభాకర్, రవిరాజ్ (ఎస్ఆర్ఏంబిసి) బాబ్జీ మహమ్మద్ (బాబూ క్యాంప్) రవి (ఎర్రగుంట) ప్రవీణ్ (చర్ల) నాగులు, శ్రీను, ఉపేందర్ (కొత్తగూడెం క్లబ్) థామస్, అబ్బారవి (సిఇఅర్క్లబ్) లను ప్రకటించారు.