Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో మేనేజిమెంటు కార్మికుల సర్వీసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచి అన్ని బెనిఫిట్స్ అమలు చేస్తానని సర్క్యులర్ జారీ చేసిందని, అలాగే చట్టం కూడా ఎక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో చెప్పిందే తప్ప 58 గాని 60 గాని 61 గాని ఎక్కడ చట్టంలో తెలియజేయలేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు పేర్కొన్నారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. సీఎం పిఎఫ్, పెన్షన్ గాని 61 సంవత్సరాలకు పరిగణలోకి తీసుకోకుండా కేవలం 60 సంవత్సరాలకు పరిగణలోకి తీసుకొని లెక్కించటం వల్ల అదనంగా చేసిన ఒక సంవత్సరానికి గాను నష్టాన్ని కలగ చేస్తున్నదన్నారు. సీఎం పిఎఫ్ యజమాన్యం ఇచ్చేదాన్ని ఏం చేయాలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి సిఐటియు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టానికి విరుద్ధంగా సీఎం పిఎఫ్ అధికారులు ఇలా కార్మికులకు నష్టం కలిగించే చర్యలను మానుకోవాలన్నారు. ఈ మార్చి చివరిలో దిగిపోయే కార్మికులకు 60 సంవత్సరాలకి సెటిల్మెంట్స్ చేయటం వల్ల నష్టపోతున్నారని దీనిని వెంటనే సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టి ఇలాంటి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో లేఖ రాయటం జరిగిందని భవిష్యత్తులో యజమాన్యం ఈ నష్టాన్ని పూడ్చటానికి అన్ని ప్రయత్నాలు చేయాలని దీని కొరకు సిఐటియు గట్టి ప్రయత్నం చేస్తామని ఇలాంటి నష్టాన్ని యజమాన్యం కానీ అలాగే సీఎం పిఎఫ్ అధికారులు కానీ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని, చట్టవిరుద్ధంగా నడుచుకో వద్దని డిమాండ్ చేశారు.