Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
ఇటీవల భూపాలపల్లిలో కేటీపీసీ ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు క్రికెట్ టోర్నమెంట్లో కేటీపీఎస్ ఏడవ దశ క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి తృతీయ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్న సందర్భంగా మంగళవారం కేటీపీఎస్ ఏడవ దశలోని చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారులను చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న కార్మికులను ఆయన అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరిన్ని క్రీడల్లో పాల్గొని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సివిల్ ఎస్ యుగపతి, ఎస్ఈ కోల్‌ప్లాంట్ గుర్రం రాజ్‌కుమార్, డీఈ ఎన్ఎస్ ఎన్ శేఖర్, కేటీపీఎస్ ఏడవ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ వై.వెంకటేశ్వర్లు, క్రీడాకారులు యండి ఆరీఫ్, డి.రమేశ్, కే వివేక్, యం.లింగానాయక్, టి.మహేష్, జి.నర్సింహారావు, జి.లక్ష్మణ్‌రావు, యండి ముత్తర్ మహమ్మద్, సఫీ, భానుమహేష్, పి.రవికుమార్, కె.రాహుల్, డి.గాంధీ, డి.మహేష్, కోచ్ కె.సతీష్‌కుమార్, మేనేజర్ వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.