Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయబద్దంగా వేతనాల పెంపు జరగలేదు
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి
నవతెలంగాణ-భద్రాచలం
మిడ్డే మిల్స్ మద్యాహ్న భోజనపధకం కార్మికులకు రూ.2000 వేతనం పెంచి రూ.3000 వేతనం నిర్ణయించటాన్ని సీఐటీయూ స్వాగతిస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షులు కె.బ్రహ్మాచారి, టౌన్ కన్వీనర్ వై.వెంకట రామారావులు తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులపధకం యూనియన్ చేసిన సమర శీల సుదీర్ఘపోరాట ఫలితమే వేతనం పెరిగిందని అన్నారు. బుధవారం సీఐటీయూ మధ్యాహ్న భోజన పధకం కార్మికులు ఛలో హైద్రాబాద్‌కి పిలుపు నిచ్చిన నేపద్యంలో వేతన పెంపు ప్రకటన ప్రభుత్వం చేసిందని వారు అన్నారు. గత 25ఏండ్లుగా కార్మికులు చేస్తున్న శ్రమను ప్రభుత్వం తగినవిధంగా గుర్తించటంలేదని వారు అన్నారు. వేతన పెంపు న్యాయబద్ధంగా జరగలేదనన్నారు. కనీసం రూ.10 వేలు పెంచితే బాగుండేదని, కోడి గుడ్లు, గ్యాస్‌కి అదనపు బడ్జెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్ దుస్తులు, ఇన్సూరెన్స్ సౌర్యాలపైన ప్రభుత్వం ప్రకటన చేయాలని వారు పేర్కొన్నారు. సీఐటీయూ ఈ కార్యక్రమంలో యూనియన్ భద్రాచలం కార్యదర్శి పిలకా శివమ్మ, నాయకురాళ్ళు వేణి, సత్యావతి, చిన్నపాప, రాజేశ్వరి, లింగమ్మ, రమ పాల్గొన్నారు.
చర్ల : మధ్యాహ్న భోజన పధకం కార్మికులకు రూ.2000 వేతనం పెంచి, రూ.3000 వేతనం నిర్ణయించటాన్ని సీఐటీయూ స్వాగతిస్తుందని సీఐటీ యూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, యూనియన్ మండల కార్యదర్శి సమ్మక్క తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ మద్యాహ్న భోజన కార్మికులపధకం యూనియన్ చేసిన సమర శీల సుదీర్ఘపోరాట ఫలితమే వేతనం పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ చర్లమండల కార్యదర్శి సమ్నక్క, అధ్యక్షురాలు పసల రాజేశ్వరి నాయకురాళ్ళు, సత్యావతి, రమణ, రాజేశివరి, లింగమ్మ, రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.