Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-చండ్రుగొండ
గత సంవత్సరం రబీ వరి పంట కొనుగోలు చేసిన సొసైటీలు, ఐకేపీ, మిల్లర్లు, సొసైటీ అధికారులు పది శాతం తరుగు పేరుతో కోత విధించి రూ.13 కోట్ల స్వాహా చేశారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం మండల వర్క్ షాపు పెద్దిని వేణు అధ్యక్షతన జరిగింది. ఈ వర్క్ షాప్లో ఐలయ్య మాట్లాడుతూ రబి వరి పంట కొనుగోలులో తరుగు పేరుతో నష్టపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలని జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో జూలై 12న రైతులతో ప్రదర్శనలు జరిపి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశామన్నారు. స్పందించిన కలెక్టర్ దీనిపై విచారించి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఆర్డీఓ నేతృత్వంలో కమిటీ వేస్తామన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టింది లేదన్నారు. ఆ కుంభకోణం పాల్పడినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు కలిసినా కాలయాపన తప్ప ఎలాంటి జవాబు లేదా అన్నారు. జిల్లా అధికారులు ఈ కుంభకోణం దాచడం సరైంది కాదని, రైతులకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే రైతులను సమకూర్చి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వరి పంట తరుగు కుంభకోణంలో అత్యధికంగా రూ.90 లక్షల వరకు నష్టపోయినా చండ్రుగొండ మండలం రైతులు ఉన్నారు. పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దీనికి నిరసనగా ఈనెల 21న నిరసన తెలపాలని అని రైతులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేయాలని రైతు సంఘం నాయకులను కోరారు. ఈనెల 28, 29 జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ధర్మ, మండల కార్యదర్శి ఐలూరి రామ్ రెడ్డి, ఆళ్ల వీరయ్య, చింతల భూపాల్, బన్నీ వెంకటేశ్వర్లు, గుర్రం ప్రతాప్, గాలి రామారావు, అజ్మీరా రమేష్ తదితరులు పాల్గొన్నారు.