Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్మిక శాఖ అధికారికి సమ్మెనోటీస్ ఇచ్చిన నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
నిర్మాణ రంగకార్మికులు పోరాడిసాధించుకున్న 1996 నిర్మాణ కార్మికులచట్టం రద్ధుకు వ్యతిరేకంగా మార్చి 28, 29న జరిగే రెండు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, బిల్జింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షులు కె.బ్రహ్మాచారి విజ్ఞప్తి చేశారు. యూనియన్ జిల్లా ఉపాద్యక్షులు వై.నాగరాజు అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడెం సీఐటీయూ కార్యలయంలో జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మాచారి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు సక్రమంగా కేటాయించలేదని విమర్శించారు. కార్మికుల కోసం ఖర్చుచేయాల్సిన సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వాలు దారిమల్లిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలపై భారాలు వేస్తుందన్నారు. నిర్మాణ రంగం ముడిసరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు నిధి రూ.1004 కోట్లు నిధులు ఇతర అవసరాలకు మళ్లించి, కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వట్లేదని ఆరోపించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి రవి సమ్మె నోటీస్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గుర్రం రాములు, ఉపాద్యక్షులు గురవయ్య, వై.వెంకటేశ్వర్లు, పండు, మోహన్, జంపయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్త సమ్మెతో బీజేపీకి కనువిప్పు కలగాలి
నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎంల పోస్టుల భర్తీలో ఆశలకు 50 శాతం అవకాశం ఇవ్వాలని, దేశ వ్యాప్త సమ్మెతో బిజేపికి కనువిప్పు కలగాలి, మార్చి 28, 29 దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న అన్నారు. మంగళవారం పట్టణంలో సీఐటీయూ అధ్వర్యంలో కార్మిక ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగ వీరన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లతో సీఐటీయూ నేతలు కలిసి సంబంధిత అధికారికి సమ్మే నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు జనుమల నగేష్, భూక్యా రమేష్, గంగ, రామసీత తదితరులు పాల్గొన్నారు.
సంఘటిత శక్తిని చాటాలి : ఇఫ్య్టూ జిల్లా కార్యదర్శి సురేందర్
బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకు వచ్చిందని ఇది ముమ్మాటికి కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టుబానిసలుగా మార్చి వేయడమేనని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్య్టూ) జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్ అన్నారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొని కార్మికుల సంఘటిత శక్తిని చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాకేం ద్రంలో ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సురేందర్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఇఫ్య్టూ జిల్లా కోశాదిఖారి ఏదులాపురం గోపాల్ రావు, జిల్లా నాయకులు వెరీత్కురి మల్లిఖార్జన్ రావు, నాయకులు చంటి, రాజు, సమ్మయ్య, జీవన్, పాషా తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : ఈ నెల 28, 29 దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజె.రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం టేకులపల్లిలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతుందని దేశాన్ని కాపాడుకోవడం కోసం సమ్మె జరుగుతుందని అన్నారు. అదేవిధంగా దేశ సంపద మొత్తం కొంతమంది పెట్టుబడి దారులకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే విధంగా, పని గంటలు పెంచే విధంగా చట్టాలు మారుస్తున్నారని విమర్శించారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని సులానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి, ఐసీడీఎస్ సీడీపీవోలకు సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు కె.శకుంతల, నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, మండల కన్వీనర్ కె.వీరన్న, ఈసం నరసింహారావు, మాధవి, హైమావతి, మంగతాయి, జినక బాబు, మూడు బిచ్చు, కుంజ రమేష్, చిన్నరామయ్య, ప్రేమ్ కుమార్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.