Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నయా నిజాం వలె వ్యవహరిస్తున్న కేసీఆర్
- మందకుమార్ మాదిగ ఆరోపణ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం టీఎన్జీవో కార్యాలయం లో మంగళ వారం భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ దేపంగి రమణయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యంయస్పీ, యం.ఆర్.పి.ఎస్, జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ, జాతీయ నాయకులు ఏర్పుల సూరి కాపు, ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, రాష్ట్ర నాయకులు బచ్చలకూర వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్, యం.యస్.పి.జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగిస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును కనుమరుగు చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్రలతో రాజ్యాంగం మార్చారని దురహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏప్రిల్ 9న హైదరాబాద్లో జరిగే యుద్ధభేరి విజయ వంతంకై జిల్లా, మండల, గ్రామ, స్థాయి రాజ్యాంగ పరిరక్షణ కమిటీల నిర్మాణం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మహా జననేత మందా కృష్ణ మాదిగ నియోజకవర్గాల పర్యటనలు ఈ నెల 29న జిల్లాలోని అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గ సదస్సులను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు సత్యనారాయణ, మహమ్మద్ సత్తార్, మల్లికార్జున్ యాదవ్, బోయ జగన్ యాదవ్, జయమ్మ, రజిని, అలవాల రాజా పెరియార్, నల్లగట్ల వెంకన్న, కొప్పుల తిరుపతి, ఈసంపల్లి కృష్ణ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.