Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శివాజీ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వచ్చే నెల 10వ తేదీన శ్రీరామనవమి సందర్బంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భద్రాచలం కార్యనిర్వహణ అధికారి శివాజీ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకీëతో కలసి శ్రీరామ నవమి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సీతారాముల కళ్యాణం నిర్వహించే కళ్యాణ కట్ట ప్రదేశాన్ని పరిశీలించారు. కళ్యాణకట్ట ప్రదేశంలో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్ర పరిచి చలువు పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్య భక్తులు దర్శనం కోసం శివాలయం నుండి క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది కళ్యాణాకి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య పనులతో పాటు, మంచినీటి సౌకర్యం, గోదావరి ఒడ్డున స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు డస్సింగ్ గదులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి పొడవునా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సీసీ అనిల్, డీఈ రవీంద్ర, వార్డు సభ్యురాలు రమణలతో పాటు ఆలయ సిబ్బంది ఉన్నారు.