Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నారాయణవరపు
నవతెలంగాణ-సత్తుపల్లి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ముఖ్యనాయకులను సోమవారం అర్ధరాత్రి వారి ఇండ్లకు వెళ్లి పోలీసులు అరెస్టు చేయడం హేమయైన చర్య అని ఆ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ అన్నారు. ఆ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీలను రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం శాంతీయుత పోరాటాలు చేస్తున్న నాయకులపై ఇలాంటి చర్యలు సరికాదన్నారు. నాయకుల నిర్భంధాల మీద కాకుండా ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వ పెద్దలు దృష్టిసారిస్తే బావుంటుందన్నారు. అరెస్టయిన వారిలో నియోజకవర్గ అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు విరివాడ నాగభూషణం, పెనుబల్లి మండల అధ్యక్షులు పంతంగి వెంకటేశ్వరరావు, వేంసూరు మండల అధ్యక్షులు కంకటి రాములు, తల్లాడ మండల నాయకులు మల్లెల వెంకటాచారి ఉన్నారని తెలిపారు.