Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీల్డ్ అసిస్టెంట్లను వెనక్కి తీసుకోవడం శుభపరిణామం
- చింతకాని పర్యటనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-చింతకాని
ప్రస్తుత తరం వారే కాదు... రాబోవు పది తరాల వారు సైతం మెచ్చే పథకం దళితబంధు అని... సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర సృష్టించిందని...ఈ పథకం ద్వారా వేలాది మంది నిరు పేదల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చింతకాని మండల పర్యటనలో భాగంగా పొంగులేటి మాట్లాడారు. దళితబంధు దేశంలోనే అత్యున్నత పథకంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేద దళితులకు ఈ పథకం ద్వారా అందజేసే పదిలక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రా వ్యాప్తంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్ సోదరసోదరీమణులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామనే ప్రకటన చేయడం శుభపరిణామం అన్నారు. జిల్లాలో వందలాది ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు ఈ ప్రకటనతో పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా చింతకాని మండలంలోని నాగిలిగొండ, కోమట్లగూడెం, నేరెడ, లచ్చగూడెం, జగన్నాథపురం, మత్కెపల్లి, బొప్పారం, గాంధీనగర్ గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల చనిపోయిన పలు వ్యక్తుల కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించి ఆర్థికసాయాలను అందజేశారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. పొంగులేటి చింతకాని మండలానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కోట రాంబాబు, వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మండల నాయకులు కిలారు మనోహర్, శేఖర్ రెడ్డి, కన్నెగంటి సీతారామయ్య, సూర్య ప్రకాష్ రావు, తాత ప్రసాద్, మంకెన రమేష్, గురజాల హనుమంతరావు వైస్ ఎంపీపీ, గడ్డం శ్రీను, బాబుల్ రెడ్డి, వేముల నర్సయ్య, సీతారామిరెడ్డి, ఎంపీటీసీ కొల్లి యామిని-వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.