Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొని కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి పెన్షన్స్ మంజూరు చేయాలని టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు,జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సూరపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ముదిగొండలో మంగళవారం నిర్వహించారు.ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉద్యమకారులకు కూడా వర్తింప చేసి ఆదుకోవాలన్నారు.రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి అందిస్తున్న సన్నబియ్యం ఆరు కేజీలు కాకుండా లబ్ధిదారుడుకు 15 కేజీలు చొప్పున అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజల మన్ననలను పొందాలన్నారు. సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల మాజీ ఉపాధ్యక్షుడు పరికపల్లి ఎల్లయ్యగౌడ్, యండ్రాతి కొండలరావు, నారపొంగు సైదులు, నారపోంగు వెంకటి, నారోజు వెంకటాచారి, పి.శ్రీనివాసరావు, మోరం పాపారావు, కొప్పుల మునయ్య, పల్లెపోంగు నాగేశ్వరరావు, కనకం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.