Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ఆర్డివో ఆదేశాలు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అర్హత కలిగిన భూదాన భూముల రైతులకు ధరణి పాస్ పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలని ఆర్డిఓ అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎర్ర వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు దొమందుల సామేలు తెలిపారు. మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తిని కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సత్యనారాయణపురం రైతులు బొమ్మెర రామ్మూర్తిని కలిసి సుదీర్ఘ కాలం నుండి భూదాన భూములకు సంబంధించిన సమస్య పరిష్కారం కొరకు వినతిపత్రం ఇచ్చారు. పెండింగులో ఉన్న సమస్యపై స్పందించిన బొమ్మెర రామ్మూర్తి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. ఖమ్మం ఆర్డిఓను కలిసి రైతుల సమస్య పరిష్కరించాలని కోరారు. ఇట్టి భూముల పైన పూర్తి ఎంక్వైరీ చేసిన ఆర్డిఓ సంబంధిత అర్హత ఉన్న రైతులకు ధరణి పాస్ పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అర్హతలేని 20 మంది రైతులను తొలగించి, అర్హులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సంబంధిత తాసిల్దార్కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో గత కాలం నుండి పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్న భూదాన రైతులు ఆనందా న్ని వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురం సర్పంచ్ ఎర్ర వెంకట్రావు, స్థానిక ఎంపిటిసి దోమందుల సామేలు, రైతులతో కలిసి బొమ్మర రామూర్తిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, బొబ్బిళ్ళపాటి బాబురావు, రైతులు శీను, పిట్టల వెంకట కృష్ణారావు, రామిశెట్టి శివయ్య, పిచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.