Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెల కోసం తొలివిడతలో డీడీలు కట్టిన వారికి ప్రాధాన్యతివ్వండి
- అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను కోరిన సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
బొగ్గు వెలికితీత కోసం సింగరేణి ఉపయోగిస్తున్న బాంబ్ బ్లాస్టింగ్స్ కారణంగా సత్తుపల్లి పట్టణంతో పాటు సమీప గ్రామాల్లోని ఇండ్లు దెబ్బతింటున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీ వేదికగా మంగళవారం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ బాంబుల పేలుళ్లతో సత్తుపల్లి మున్సిపశ్రీనాలిటీ పరిధిలోని వెంగళరావునగర్, జలగంనగర్, ఎన్టీఆర్నగర్, మండలంలోని సింగరేణి సమీప ప్రాంతాలైన కొమ్మేపల్లి, కిష్టారం, రేజర్ల తదితర ప్రాంతాల్లో అనేక ఇండ్లు బీటలు వారడంతో పాటు స్లాబు పెచ్చులు ఊడిపడుతున్నాయని తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ కూడా వ్యవసాయ ప్రాంతమని, టౌన్లోనే వ్యవసాయ కూడా భూములుంటాయని సండ్ర వివరించారు. బాంబ్ పేల్లుళ్ల తీవ్రతను తగ్గించడంతో పాటు దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే సండ్ర కోరారు.
గొర్రెల కోసం తొలివిడతలో డీడీలు కట్టినవారికి ప్రాధాన్యతివ్వండి...
గొర్రెల కోసం మొదటి విడతలో డీడీలు కట్టిన వారికి పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని యాదవ సోదరులు డీడీలు కట్టిన వారిలో ఉన్నారని మంత్రికి వివరించడంతో పాటు పంపిణీ కార్యక్రమానికి మీరే వచ్చి యాదవ సోదరులకు గొర్రెలు అందించాలని ఎమ్మెల్యే సండ్ర మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. డీడీలు కట్టిన వారితో పాటు కట్టని వారికి పంపిణీ చేయడం జరుగుతుందని, తానే వచ్చి పంపిణీ చేస్తానని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.