Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంటర్ లైటింగ్ పనులకు
- శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు సుమారు రూ.3 కోట్లతో నిర్మించనున్న సెంటర్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. పట్టణాలకు ధీటుగా మండల కేంద్రాలు, గ్రామాల అభివృద్ధి చేయడం తన లక్ష్యమన్నారు. పల్లెటూర్లు దేశానికి పట్టుబొమ్మలని, ఎవరేమనుకున్నా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి చేసి తీరుతానని, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్యా సోన, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, గణేష్ టెంపుల్ గుడి చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు, ఉర్దూ గర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వజ్జ రాజు, జిల్లా ఎంపీటీసీ అధ్యక్షురాలు కొల్లు పద్మ, భద్రమ్మ పాల్గొన్నారు.