Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
- డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు
నవతెలంగాణ-భద్రాచలం
మారుమూల గిరిజన ప్రాంతాలలో సేవా దృక్పధంతో ఎవిస్ హాస్పిటల్స్ సేవలు అందించడం ప్రశంసనీయమని వైద్య ఆరోగ్య శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.ఎల్.కాంతారావు అన్నారు. ఆదివారం భద్రాచలంలోని రాజుల సత్రంలో క్షత్రియ సేవా సంఘం సౌజన్యంతో ఎవిస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచిం చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎవిస్ హాస్పిటల్స్ ఎండీ, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ రాజా, వి.కొప్పాల మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు తాము విరివిగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి 150కి పైగా వైద్యశి బిరాలు నిర్వహించామని ఆయన వివరించారు. రానున్న కాలంలో మరిన్ని శిబిరాలు నిర్వహించి పేదలకు ఉపయోగపడేలా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా శిబిర నిర్వాహక ఛైర్మన్ దాట్ల చిన రామచంద్రరాజు (నాని బాబు) మాట్లాడుతూ తాము కోరిన వెంటనే నెలరోజులలోగా ఇటువంటి ప్రాంతంలో మెగా వెద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. ఈ ప్రాంతవా సులకు ఉపయోగపడాలనే సంకల్పంతో తమ సంఘం తరపున ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్షత్రియ సంఘం కార్యదర్శి వేగేశ్న రామకృష్ణంరాజు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఈ శిబిరం ఏర్పాటు చేసినా అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ గౌతమ్ దెందుకూరి, డాక్టర్ కాశీ, డాక్టర్ శ్రీధర్ వర్మ, డాక్టర్ సీతారామరాజు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సుమారు 200 మందికి పైగా పేషెంట్లు ఈ శిబిరంలో ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వీరికి క్షత్రియ సేవా సంఘం, ఎవిస్ హాస్పిటల్స్ తరపున డి.రామ చంద్రరాజు, పిఆర్వో అచ్యుత్, రవీంద్ర, కుమార్, రాఘవన్, మహేష్ తదితరులు సేవలందించారు.