Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ నేతల పిలుపు
నవతెలంగాణ-ఇల్లందు
దేశంలో 88 బొగ్గు బావులతో కలిపి సింగరేణి 4 బావులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మోడీ ప్రభుత్వం నిర్ణయం మొత్తం బొగ్గు పరిశ్రమ మనుగడకు అత్యంత ప్రమాదకరమైనదని బొగ్గు బావులను కాపాడుకోవాల్సిన బాధ్యత గనికార్మికులపై ఉందని జేఏసీ నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, కే.సారయ్య, అబ్దుల్ నబీ, మహబూబ్లు అన్నారు. సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పరిశ్రమలు రక్షణ, ఉద్యోగభద్రత దేశాభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుభాగాన ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు జె.సీతారామయ్య, దేవరకొండ శంకర్, రాసుద్దిన్, శ్రీనివాస్, రఘు, లక్ష్మీనారాయణ, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.