Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజె.రమేష్
నవతెలంగాణ-టేకులపల్లి
మార్చి 28, 29 తేదీలలో జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజె.రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం టేకులపల్లి సంఘం కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 రోజులు సమ్మె జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. మొదటి రోజు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం కానుందని పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని కోరారు. మోడీ ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈసం నరసింహారావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె.వీరన్న, జిల్లా కమిటీ సభ్యురాలు కె.శకుంతల, మూడు బిచ్చు, జినక బాబు, కుంజ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల సమ్మె విజయవంతమైతేనే కేంద్రానికి కనువిప్పు
కొత్తగూడెం : రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలలో దేశం త్రీవ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దీనికి కేంద్రంలో పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలే కారణమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం స్థానిక శేషగిరిభవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. నాడు వ్యాపారం పేరుతో దొంగచాటుగా వచ్చిన ఆంగ్లేలు దోశాన్ని దోపిడి చేసేందుకు రెండు వందల సంవత్సరాల కాలం పట్టిందని, కానీ మోడీ తన ఎనిమిదేళ్ళ కాలంలోనే దేశ సంపదను స్వదేశీ, విదేశా పెట్టుబదిదారులకు అధికారికంగా దోచిపెట్టాడని విమర్శించారు. దేశాన్ని ప్రైవేటేజేషన్, నేషనల్ మోనిటైజేషన్, పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. అవినీతి యోధుడుగా చెప్పుకునే మోదీ అత్యంత అవినీతికర పద్దతుల్లో ఆదాని, అంబానిలంటి కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను అతితక్కువ ధరలకు అమ్మివేస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె కేంద్రానికి కనువిప్పు కలగాలన్నారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు వంగా వెంకట్, జి.వీరస్వామి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, నాయకులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కార్మిక శ్రామిక వర్గాల రక్త మాంసాలు పీక్కు తింటున్న పాలకులు
దేశంలోని కార్మిక, శ్రామిక వర్గాల రక్త మాంసాలు పాలక ప్రభుత్వాలు పీక్కు తింటున్నాయని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు నెమల్ల సంజీవ్ అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న పేదవాడు ఇంకా పేదవాడు గానే మగ్గిపోతున్నాడని, ధనవంతులు అందనంత ఎత్తుకు ఎదిగి పోతున్నారన్నారు. పరాయి పాలనలో అందుబాటులో ఉన్న మార్కెట్ ధరలు స్వదేశ పాలనలో స్వార్థపర రాజకీయ దోపిడీ వర్గాల దోపిడీకి సామాన్యుడు బలైపోతు ఉన్నాడన్నారు. కార్మిక రైతు చట్టాలలో మార్పులు చేస్తూ కార్మిక రైతు కూలీలపై దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు ద్రోహం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ నెల 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయం చేయాలని పిలుపు నిచ్చారు.