Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుబ్బలమంగమ్మ ఆలయంకు పోటెత్తిన భక్తులు అ అడవి మార్గంలో వాహనాల రద్దీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
గిరిజనుల ఆరాధ్య దేవత వనంలో వెలసిన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుండే భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అశ్వారావుపేటకు సుమారు 25 కిలోమీటర్లు దూరంలో తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులోని దట్టమైన రక్షిత అటవీ ప్రాంతంలో కొలువు దీరిని గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కిక్కిరిసిన జనం వందలాది వాహనాలు రాకతో అడవిలో మట్టి దారులు జామయ్యాయి.