Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్‌కుమార్‌పై దాడి అమానుషమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్‌రెడ్డి, కాటిబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో ఒకే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న గురిజాల గోపి, కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హూస్సేన్పై పార్టీ అధిస్టానం సత్వరమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వీరు, వీరి అనుచరులు అక్రమ దందాలు పాల్పడుతూ ప్రశ్నించినా వారిపై భౌతికదాడులు చేస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి ఎండి.షబానా, మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, రమణ, తదితరులు పాల్గొన్నారు.