Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఉసిరి కాయల పల్లి కోట మైసమ్మ గుడి దగ్గర రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్‌కు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ కలిసి శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించాలని, సమాచార హక్కు చట్టం పట్ల అందరికీ అవగాహన కల్పించారని, కమిషన్ బాధ్యతల్లో ఉండి ఎన్నో కేసులకు తక్షణ పరిష్కారం చేయిస్తున్నారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ట్రైబల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ ప్రతాప్ సింగ్ నాయక్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీందర్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు యుగేందర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు చందు తదితరులు పాల్గొన్నారు.