Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పరామర్శించి చెక్కు అందజేత
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఖమ్మం కార్పొరేషన్ దానావాయిగూడెంకు చెందిన పెడవల్లి రుక్మిణమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చును కుటుంబ ఆర్దిక పరిస్థితి దష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఇప్పించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావుకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫార్సుతో సీఎం సహాయ నిధి నుండి ఆమెకు రూ.3 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు చేశారు. కాగా ఆదివారం నాడు నేరుగా లబ్ధిదారుని నివాసానికి వెళ్లిన ఎంపీ నామ నాగేశ్వరరావు వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, జడ్పీటిసి యండపల్లి వరప్రసాద్, కార్పొరేటర్ బట్టపోతుల ఉషారాణి, కిలారి రాంబాబు , డా.కిలారి సునీల్, కిలారి ఉదరు ,సతీష్, రాముల రవి, గ్రామశాఖ సతీష్, బాణాల వెంకటేశ్వరరావు, సామినేని సతీష్, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.