Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టు దోనేపల్లి కుటుంబానికి పొంగులేటి పరామర్శ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తిరుమలాయపాలెం మండలం నవతెలంగాణ విలేకరి దోనేపల్లి వెంకన్న కుటుంబ సభ్యులను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వెంకన్న భార్య నాగమణి, పిల్లలు చైతన్య, వినరులను అక్కున చేర్చుకున్నారు. వెంకన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. చిన్న వయస్సులో వెంకన్న మృతిచెందడం బాధాకరమన్నారు. ఏ కష్టమొచ్చినా తాను తోడుంటానని ఓదార్చారు. వెంకన్న లేడని కలత చెందొద్దన్నారు. వెంకన్న మరణం ఎలా చోటుచేసుకుందో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే వృద్ధాప్యంలో కదల్లేని స్థితిలో ఉన్న వెంకన్న తండ్రి వద్దకు వెళ్లారు. కంటనీరు తూడ్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వెంకన్న కూతురు చదువుకున్న స్పెషలైజేషన్ కోర్సుల వివరాలు తెలుసుకున్నారు. తన రిఫరెన్స్‌పై ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఎంబీఏ చదువుతున్న వెంకన్న కుమారునికి సైతం కోచింగ్, ఇతరత్ర చదువులు, ఉద్యోగం విషయంలో అండగా ఉంటానన్నారు. తండ్రిలేని లోటు పూడ్చలేనిదే అయినా...మరింత కర్తవ్యంతో వ్యవహరించి కుటుంబానికి అండగా నిలబడాలని పిల్లలిద్దరికీ హితబోధ చేశారు. ఆర్థిక సహాయం అందించారు. పొంగులేటి వెంట నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, డెస్క్ఇన్చార్జి వీరేష్, నాయకులు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్‌రెడ్డి, మువ్వా విజరుబాబు, బజ్జూరి వెంకటరెడ్డి, కొప్పుల అశోక్, ముదిరెడ్డి మల్లారెడ్డి, నూకల రంగారెడ్డి తదితరులు ఉన్నారు.
- జర్నలిస్టు వెంకన్న కుటుంబానికి తుమ్మల పరామర్శ
నవతెలంగాణ విలేకరి దోనేపల్లి వెంకన్న కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. వెంకన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధి కె.శ్రీనివాసరెడ్డి, డెస్క్ ఇన్చార్జి వీరేష్, నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, తమ్మినేని కృష్ణయ్య, మధు, సుధాకర్‌రెడ్డి, పంతులు నాయక్, పత్తి శ్రీను తదితరులు ఉన్నారు.